రాజస్తాన్ ఎన్నికలలో బాగంగా ఓ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారాయి. దాంతా రామఢ్ అసెంబ్లీ స్థానంలో భర్తపైనే భార్య పోటీకి దిగి ప్రత్యర్థిగా మారారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వీరేంద్ర సింగ్ ఉన్నారు. సింగ్ భార్య రీటా చౌధరీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఆమె జననాయక్ జనతా పార్టీలో చేరి అదే స్థానం నుంచి పోటీకి సిద్దమైంది.