దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్‌తో అగ్రస్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ప్రాంతాలు ఉన్నాయి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం. లక్ష మందిఉన్న ప్రాంతంలో 446 నేరాలు జరుగుతున్నాయి. జనాభా పెరుగుదల, ఉపాధి కొరత, సామాజిక భద్రత, పోలీసులకు మౌలిక సదుపాయాలు లేకపోవడమే నేరాల పెరుగుదలకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.