చంద్ర గ్రహణాన్ని పురస్కరించు కొని ఈ నెల 28వ తేదీన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని మూసి వేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆలయాన్ని మూసివే యనున్నట్లు చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రహణం అనంతరం 29న ఉదయం 4 గంటలకు తెరచి, ఆలయ శుద్ధి చేసి పుణ్యాహవచనం, గ్రహణశాంతి, అభిషేకం నిర్వహిస్తామన్నారు. 6గంటలకు భక్తులకు స్వా మి దర్శనాన్ని కల్పిస్తామని తెలిపారు.