‘‘రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్త చొక్కా విప్పించడం,సైకిల్ కి కట్టుకున్న టీడీపీ జెండా తొలంగించడం నీచాతినీచం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇది కేవలం టీడీపీ సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్న జగన్ సర్కార్ పై ప్రతిఒక్కరూ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ సీతారామన్‌కు పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. మొదటిసారి ఫోరెన్సిక్ ఆడిట్ అనే పదాన్ని వింటున్నాం. రాష్ట్రం అప్పులకుప్పలా మారడానికి సహకారం అందించింది కేంద్రం కాదా? బీజేపీ,వైసీపీ డ్రామాలు ఆడుతోంది. వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది బీజేపీ సహకారంతోనేనని టీడీపీ, జనసేన గమనించాలి’’ అని రామకృష్ణ అన్నారు.