ఎపీలో అప్పుల భారాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేశామని దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. పార్లమెంట్లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని వివరించామన్నారు. కార్పోరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చామని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.