ఏపీలో కరువు తాండవం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రం ఇతర కరువు రాష్ట్రాల్లో పర్యటన చేస్తుంటే... ప్రభుత్వాలు నివేదికలు అందిస్తున్నాయన్నారు. ఇక్కడ జగన్ మాత్రం పట్టించుకోరన్నారు. రైతులు వేల రూపాయలు వెచ్చించారని.. సరైన సమయంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ అన్నారు. జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. గతంలో ఎప్పుడు శ్రీశైలం, సాగర్ డ్యాంలలో ఇంతటి నీటి కొరత లేదన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తాగునీటి సమస్య కూడా జఠిలం అయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్ మైండ్ ఎప్పుడు జైలు,కోర్టుల చుట్టే తిరుగుతోందని రామకృష్ణ విమర్శించారు.