దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, మద్యం తయారీదారులు, అమ్మకం దారులను ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని.. ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశామని.. వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పురంధరేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల వివరాలేవి?.. మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు. ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవని పురంధరేశ్వరి నిలదీశారు.