తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మంత్రి రోజాపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి ఆలయం ముందు నుంచి రాజకీయాలు మాట్లాడి రోజా తన గొయ్య తానే తవ్వుకున్నారు. రోజా గంజి స్టేజీ నుంచి ఇప్పుడు బెంజి కథ వరకు రాష్ట్రంలో అందరికీ తెలుసు. రోజా చేతివాటం ట్రస్టు పెట్టింది. ఆమె చేతివాటం డబ్బులను ఆ ట్రస్టులో వేస్తోంది. పవన్ కల్యాణ్, లోకేశ్ ఒక ఫ్రేమ్‌లో కన్పిస్తేనే ఇలా వణికి పోతున్నారు. వారు ఇద్దరు రంగంలోకి దిగితే వీరి పరిస్థితి ఏంటీ? అని అనిత వ్యాఖ్యానించారు.