మెప్మా మహిళలకు మార్గదర్శిగా నిలవాలని నగర కమిషనర్ అరుణ పిలుపునిచ్చారు. బుధవారం మిట్టూరులోని మెప్మాప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించిన నగరపాలక సంస్థ పరిధిలోని భరతమాత పట్టణ మహిళా సమైఖ్య కార్యవర్గ సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ మహిళల్లో జీవనోపాదులను మెరుగుపరిచేలా కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. మహిళ ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తే తద్వారా కుటుంబం, సమాజం ఆర్థికంగా బలపడతాయన్నారు.