ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. మూడు అనుబంధ సంస్థలను టెక్ మహీంద్రాలో విలీనం చేయనున్నట్లు తెలిపింది. పెరిగోర్డ్ ప్రీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పెరిగోర్డ్ డేటా సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టెక్ మహీంద్రా సిరియం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల విలీన పథకాన్ని బోర్డు ఆమోదించింది. దీంతో ఈ కంపెనీల అప్పులు, ఆస్తులు టెక్ మహీంద్రాకు బదిలీ కానున్నాయి.