రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టి పాలన దక్షతతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు (25-10-2023) బుధవారంతో అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే వార్షికోత్సవ సంబరాలకు దూరంగా ఉండి రోజువారీ అధికారిక విధుల్లోనే గడపడం విశేషం. ఈ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర లిఖించారు. ‘ఏడాదిలో ఎంతో సాధించాం. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అని నెట్టింట ఆయన వీడియో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa