చేబ్రోలు మండలంలోని వడ్లమూడి , నారాకోడూరు గ్రామాలలో ప్రభుత్వ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి బుధవారం పరిశీలించారు. వడ్లమూడి గ్రామ సర్వే నెంబర్లో ఎం ఎస్ ఎం ఈ పార్కు, ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కొరకు భూ పరిశీలన జరిగిందని ఆమె జెసి మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, తహసిల్దార్ గోపాలకృష్ణ, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.