అచ్చుతాపురం మండలంలోని వెదురువాడ సచివాలయం పరిధి వైయస్సార్ నగర్ కాలనీలో బుధవారం పలు అభివృద్ధి పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే యువి. రమణమూర్తి రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. మెయిన్ రోడ్ నుండి ధర్మారెడ్డి రాజు ఇంటి వరకు పది లక్షల రూపాయలతో నిర్మించిన కల్వర్టు, రోడ్డును, వైయస్సార్ నగర్ కాలనీలో మోల్డ్ టెక్ ప్యాకింగ్ లిమిటెడ్ ఆర్థిక సహాయం రూ. 8, 30, 000తో నిర్మించిన ఆర్వో ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.