రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి కంది పప్పు అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. కిలో కంది పప్పును రూ.67కే అందిస్తామని, అక్టోబర్ 31 నాటికి అన్ని రేషన్ దుకాణాల్లో కంది పప్పును అందుబాటులో ఉంచుతామని తెలిపారు. లబ్ధిదారులు ఇంటి వద్దకు వచ్చే మొబైల్ వాహనం ద్వారా కూడా కంది పప్పు పొందవచ్చని పేర్కొన్నారు.