స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న "ఆడుదాం ఆంధ్రా" టోర్నమెంట్ ను నగర పాలక సంస్థ పరిధిలో విజయవంతం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ ఆకాంక్షించారు. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ నెల్లూరు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు.ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద పాల్గొన్నారు.