హిమాచల్‌ప్రదేశ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బుధవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఆయనను సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సీఎంకు వైద్యుల బృందం అన్ని పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నార్మల్ అని వైద్యులు తెలిపారు. మిగతా పరీక్షల్లోనూ అంతా నార్మల్‌గానే ఉందని పేర్కొన్నారు.