కర్ణాటక రాష్ట్రం చిక్కుబళ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం పై పెనుకొండ వైసిపి సీనియర్ నాయకురాలు సానే ఉమారాణి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది కూలీలు అకాల మృత్యువాత పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.