కేంద్రం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శించారు. మోదీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకునే వారు లేరని అన్నారు. కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదని రాజస్తాన్లోని ఝన్ఝున్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో అన్నారు.