మన దేశంలో చంద్రగ్రహణం 28న రా. 11.30 కు ప్రారంభమై 29న తెల్లవారుజామున 3:58కు పూర్తవుతుందని ప్లానెటరీ సొసైటీ తెలిపింది. రేపు అర్థరాత్రి 1.05 నుంచి 2:23 వరకు మాత్రమే గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వేళలో వంటలు వండకూడదని, పూజలు చేయకూడదని, భోజనం తీయకూడదని, బయటకు వెళ్లకూడదని జ్యోతిష్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ వంటి మంత్రాలను మననం చేసుకోవాలని ప్రకటించారు.