అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు భారీ జరిమానా విధించింది. కోర్టు సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 10 వేల డాలర్లు (రూ.8 లక్షలు) జరిమానా విధించినట్లు జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ వెల్లడించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జైలు శిక్షతో పాటు తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.