అస్సాం సిఎం హిమాంత బిశ్వ శర్మకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచార సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గురువారం ఈసి నోటీసు పంపించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఈనెల 18న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ‘ఒక చోటికి ఒక అక్బర్ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్లను పిలుస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించాలి’ అని రాష్ట్ర కేబినెట్లోని మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.