బైక్‌పై వెళుతన్న మంగళమ్మ అనే మహిళ, ఆమె కుమారుడు మారుతిని కొందరు దుండగులు కారుతో వెంబడించి, వేట కొడవళ్లతో దాడి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం పి.బ్యాడిగెర సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడితో తీవ్రంగా గాయపడ్డ తల్లీకుమారులు.. చివరకు వారి నుంచి తప్పించుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించారు. దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa