విద్యుత్ మోటార్‌తో నీరు పెడుతుండగా షాక్ తగలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తాతిరెడ్డిపాలెం జగనన్న కాలనీలో జరిగింది. జక్కిరెడ్డి వీరారెడ్డి (48) లాం గ్రామ పంచాయతీ పరిధిలోని తాతిరెడ్డిపాలెంలో జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటికి నీరు కొడుతుండగా లీకేజీని సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.