రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి లోని ఆయన నివాసంలో శుక్రవారం ఆదరణ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి అమర్నాథ్ కు వివరించారు. అనంతరం ఈ నెల 29వ తేదీన కశింకోట లో ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే పలు సేవా కార్యక్రమాలకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.