విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. రద్దయినవాటిలో డబుల్ డెక్కర్ రైలు కూడా ఉంది. అక్టోబరు 29వ తేదీ వరకు రాజమండ్రి-విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైలు (07466)ను పూర్తిగా రద్దు చేశారు. విశాఖపట్నం-రాజమండ్రి రైలు కూడా రద్దు అయిందని రైల్వే అధికారులు తెలిపారు.