ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. దీంతో సోమవారం తీర్పు రానుంది.