ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతావి ఓటింగ్‌లో పాల్గొనలేదు.