ఏపీలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు నవంబర్ 14, 15 తేదీల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టును నిర్వహించనున్నట్లు APPSC పేర్కొంది. గ్రామ, వార్డు. సచివాలయాల ఉద్యోగులు, గ్రేడ్-1, 2 VROలు, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, 2014 మే 12 తర్వాత పలు విభాగాల్లో కారుణ్య నియామకాల్లో చేరిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, NOV 7 నుంచి హాల్టికెట్లు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి తెస్తామని తెలిపింది.