నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యభివృద్ధి శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.