వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 104, 108 జిల్లా మేనేజర్ ప్రతాప్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు, కార్వేటి నగరం, పలమనేరు, తిరుపతి పరిధిలో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. 10 వ తరగతి పాస్ అయి, డ్రైవింగ్ లైసెన్సు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని 104, 108 కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa