దేశవ్యాప్తంగా పలు నగరాల మీదుగా ప్రస్తుతం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల సేవల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద అనుమతి కోరుతూ లేఖ రాసింది. దీపావళి పండుగకు ప్రయాణికుల సౌకర్యం కోసం నవంబరు 9 నుంచి 12వ తేది వరకు చెన్నై నుంచి బెంగుళూరు మీదుగా కేరళలోని ఎర్నాకుళం వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు, రైళ్ల వివరాలు త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.