ఏపీ హైకోర్టు రోస్టర్లో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మార్పులు చేశారు. ఇటీవల నలుగురు కొత్త న్యాయమూర్తుల రావడంతో న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు అత్యంత కీలకమైన బెయిల్ పిటిషన్లపై విచారణ బాధ్యతలను అప్పగించారు. క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతను జస్టిస్ బీఎస్ భానుమతికి అప్పగించారు. కాగా మరిన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త రోస్టర్ సోమవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.