బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో ఓ యువకుడి (24) మృతదేహం లభించింది. మృతుడు పీయూష్ సింగ్ అని, అతను ఎమ్మెల్యే నీతూ సింగ్కు వరుసకు అల్లుడు అవుతాడని జిల్లా ఎస్పీ అంబ్రిశ్ రాహుల్ తెలిపారు. ఆ ఇంటిని గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే బావమరిది కుమారుడైన గోలూ సింగ్ వాడుకుంటున్నాడని, అతడి గదిలోనే పీయూష్ మృతదేహం లభించిందన్నారు. అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.