ముంబై నగర రోడ్లపై చక్కర్లు కొట్టే 'కాలీ పీలీ' ట్యాక్సీల కాలపరిమితి ముగియనుంది. నగరానికి వచ్చే యాత్రికులు, సందర్శకులను గమ్య స్థానాలకి చేర్చడంలో ఈ ట్యాక్సీలు ముఖ్యపాత్ర పోషించేవి. ఈ ట్యాక్సీలు రేపు అర్ధరాత్రి తర్వాత ఇక కనిపించవు. గత 60 ఏళ్లుగా సేవలందించిన 'కాలీ పీలీ' ట్యాక్సీల కాలపరిమితి రేపటితో ముగుస్తోంది. దీంతో ఈ ట్యాక్సీలతో వారికున్న మధుర జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa