ఉరవకొండ మండలం మోపిడి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్ నుండి కళ్యాణదుర్గంకు హనుమంతు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ క్షతగాత్రున్ని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa