నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో కార్మికులు, యూనియన్ నాయకులు ఆదివారం ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa