టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫున ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే వాదనలు సాగాయి. సోమవారం మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.