పలు రైళ్లు రద్దయిన నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్లో ఇరుక్కుపోయిన వారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని విశాఖ స్టేషన్ మాస్టర్ అరుణ శ్రీ తెలిపారు. రైళ్ల రద్దు కారణంగా స్టేషన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుల పిల్లలకు పాలు, బిస్కెట్లు వంటివి అందిస్తున్నామన్నారు. సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ కమిషనర్ కార్యాలయం నుంచి 10 మంది అధికారుల బృందం విశాఖ చేరుకుందని వివరించారు.