ఎల్ కోట మండలం కంటకాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కరణం శివరామకృష్ణ సోమవారం పరామర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారిలో ధైర్యాన్ని నింపారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.