కందుకూరు పట్టణంలోని వేలాది మంది ముస్లింలకు సంబంధించిన కోటకట్ట ముస్లిం స్మశాన వాటికలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి ఉన్నాయని వాటిని తొలగించాలని స్థానిక ముస్లిం మత పెద్దలు సోమవారం స్పందన కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కు వినతిపత్రం ఇచ్చారు. స్మశాన వాటికలో విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కల వల్ల అంత్యక్రియల కార్యక్రమానికి చాలా ఇబ్బందికరంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని మత పెద్దలు తదితరులు కోరారు.