విజయవాడ వేదికగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ పరిశీలకుడిగా బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పరిశీలకుడిగా చేగొండి సూర్యప్రకాశ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజా సమస్యలపై ఇరుపార్టీలు ఉమ్మడిగా పోరాటం చేయాలని ఈ భేటీలో తీర్మానించారు. ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించారు.