ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజా శ్రేయస్సే ముఖ్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి తెలిపారు. సోమవారం కలకడ మండలం, గంగాపురం, దొడ్డిపల్లి పంచాయతీల్లో నిర్వహించిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు నవరత్నాలు అమలు చేసి సిఎం చరిత్ర సృష్టించారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి రవికుమార్, జడ్పిటిసి హారిక, పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.