గుంటూరు అరండల్ పేట రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో ఓ వ్యక్తి చోరీకి యత్నించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 23న ఉదయం కార్యాలయం తెరిచేందుకు సిబ్బంది వచ్చిన సమయంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్న షట్టర్స్ కొద్దిగా తెరిచి ఉన్నట్లు గుర్తించారు. నిఘా కెమెరా లోనూ చోరీకి వచ్చిన వ్యక్తి కదలికలు స్పష్టంగా కనిపించాయి. రైల్వే అధికారులు అరండల్ పేట పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.