సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైసీపీ అవనిగడ్డ నియోజకవర్గ యువనేత సింహాద్రి వికాస్ పిలుపునిచ్చారు. మంగళవారం చల్లపల్లి మండలం నడకుదురులో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 2వ తేదీన అవనిగడ్డలో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.