ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని రోజులు వేదనకు గురయ్యా..... నారా భూవనేశ్వరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 08:57 PM

చంద్రబాబు బెయిల్ నేపథ్యంలో ఆయన సతీమణిి నారా భువనేశ్వరీ సంతోషం వ్యక్తంచేశారు. చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారన్న సమాచారంతో నారా భువనేశ్వరి భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని తెలిపారు. తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట కలిగించిందని చెప్పారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతు ఇచ్చారని వివరించారు. రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని భువనేశ్వరి తెలిపారు. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com