జిల్లాలో వర్షాభావ కారణంగా సాగుకు నోచుకోక, పంటలు దెబ్బతిని నెలకొన్న కరువు పరిస్థితుల దృశ్యా ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కోరారు. మంగళవారం రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాలకు చెందిన రైతులతో కలిసి స్థానిక ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారు నజీర్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు.