గ్యాస్ సిలిండర్ డెలివరీ రశీదులోని మొత్తానికి మించి అదనపు చెల్లింపులు చేయొద్దని ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ వెల్లడించారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15కి.మీ పరిధిలో డెలివరీకి చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కువ రుసుము వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలన్నారు.