LPG సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.101.50 మేర పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పుల నేపథ్యంలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. ఇక నేటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.1833కు చేరింది. గృహ అవసరాల సిలిండర్ ధరల్లో మార్పులు చేయలేదు.