ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఆదివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. కందసర్ గ్రామానికి చెందిన పరమానంద ముదులి (45)కి ఆయన భార్య సుకాంతికి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పరమానంద అనుమానించాడు. ఈ విషయంలో భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీనిపై ఆగ్రహించిన సుకాంతి తన భర్త మర్మాంగాన్ని కత్తితో కోసేసింది. బాధితుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa