శింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి క్రింద ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతుల మీదుగా బుధవారం చెక్కును పంపిణీ చేశారు. నార్పల మండలం కేశేపల్లి గ్రామానికి చెందిన పి. వీర నల్లయ్య(52) ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కారణాలతో మృతి చెందారు. భర్తను కోల్పోయిన భార్య పి. శారదకు ఎమ్మెల్యే సీఎం ఆర్థిక సహాయ నిధి కింద దాదాపు రూ. 3. 50 లక్షలు మంజూరు చేయించి, చెక్కును వారి కుటుంబానికి అందజేశారు.